Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- కుటుంబ కలహాలే కాల్పులకు కారణమా?
- మారుతీ నగర్లో మహిళపై విచక్షణారహితంగా కాల్పులు
- స్నేహితుడితో కలిసి బైక్‌పై పరారైన నిందితుడు
- పాతబస్తీ ఆయుధాల ముఠాతో లింకులపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime : నగరంలోని మల్కాజ్గిరి పరిధిలో గల మారుతీ నగర్లో ఘోరమైన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి తన భార్యపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మల్కాజ్గిరి మారుతీ నగర్‌కు చెందిన ఉషారాణి, ఆమె భర్త అరుణ్ మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మనస్పర్థలు ముదరడంతో, భార్యపై పగ పెంచుకున్న అరుణ్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అరుణ్, పాతబస్తీకి చెందిన తన స్నేహితుల ద్వారా ఒక తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో తన స్నేహితుడితో కలిసి వచ్చిన అరుణ్, మారుతీ నగర్లో ఉషారాణిపై ఒక్కసారిగా భారీగా కాల్పులు జరిపాడు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం అరుణ్, అతనికి సహకరించిన మరో వ్యక్తి ఇద్దరూ కలిసి ఘటనా స్థలం నుండి బైక్‌పై వేగంగా పారిపోయారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాతబస్తీలోని ఆయుధాల ముఠాతో అరుణ్‌కు ఉన్న లింకులపై కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే ఈ కాల్పులకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!