Horrific Incident: కుషాయిగూడలో పోకిరీల ఉన్మాదం.. కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి.. ప్రైవేట్ పార్ట్స్…!
- బొలెరోతో ఢీకొట్టి కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లిన దుండగులు
- ప్రశ్నించినందుకే ప్రాణాలతో ఆట
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాధితుడు
- నిందితుల వివరాలు వెల్లడి చేయాలని కుటుంబం డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైరన్లు వేసుకుంటూ రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని ప్రాణాలతోనే ఈడ్చుకెళ్లే స్థాయికి వీరి ఉన్మాదం చేరింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక సామాన్య ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు కొందరు యువకులు.
బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణ ముగించుకుని రాత్రి సమయంలో తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో ఒక బొలెరో కారులో ఉన్న కొందరు యువకులు కారుకు సైరన్ వేసుకుంటూ, అతివేగంతో రోడ్డుపై హంగామా సృష్టించారు. సతీష్ కారును బొలెరోతో బలంగా ఢీకొట్టిన ఆ యువకులు, కనీసం ఆపకుండా వేగంగా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!
దీంతో సతీష్ వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళాక ఆపగలిగాడు. కారు దిగి దుండగుల బొలెరోకు ఎదురుగా నిల్చుని, ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం కనికరం లేని ఆ యువకులు కారును సతీష్ వైపు వేగంగా పోనిచ్చారు. కారు వేగంగా రావడంతో సతీష్ కిందపడిపోయి, ప్రాణ రక్షణ కోసం బొలెరో ముందున్న బంపర్‌ను గట్టిగా పట్టుకున్నాడు. కారు కింద మనిషి ఉన్నాడని తెలిసినా, ఆ పోకిరీలు కనికరించలేదు. సుమారు 700 మీటర్ల నుండి ఒక కిలోమీటరు వరకు అలాగే ఈడ్చుకెళ్లారు. ఆ భయంకరమైన రాపిడికి సతీష్ వీపు భాగం అంతా రోడ్డుకు గీసుకుపోయి తీవ్రంగా దెబ్బతింది. నొప్పి భరించలేక సతీష్ బంపర్ వదిలేయగా, ఆ కారు అతనిపై నుంచే దూసుకెళ్లిపోయింది.
కారు కింద పడి ఈడ్చుకెళ్లడం వల్ల సతీష్ ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కాలు విరగడంతో పాటు వీపు భాగం మొత్తం చెక్కుకుపోయింది. ప్రస్తుతం సతీష్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన జరిగి ఇంత దారుణం జరిగినా పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించకపోవడంపై సతీష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరుల కారుకు పోలీసుల లాంటి సైరన్ ఎలా ఉంది? ఆ కారులో ఉన్న యువకులు ఎవరు? వారు మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నారా? నిందితుల వెనుక ఎవరైనా రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఉన్నారా? అందుకే పోలీసులు వివరాలు దాస్తున్నారా? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది.
CM Chandrababu: మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!