West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..
- నదియా జిల్లాలో కాంగ్రెస్ నేత అనిసూర్ రెహ్మాన్, ఆయన కుమారుడి హత్య..
- గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో మృతి..
- కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో కాంగ్రెస్ నేత, ఆయన 24 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపిన సంఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బెంగాల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, నదియా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అనిసూర్ రెహ్మన్(50), అతడి కుమారుడు అబు సిఫియాన్తో కలిసి బెతువాదహరి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శనివారం నాగాది రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి కారుపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ముందుగా కాల్పులు జరిపిన దుండగులు అనంతరం పదునైన ఆయుధాలతో ఇద్దరిపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం తెలియజేస్తోంది. ఈ దాడిలో అనిసూర్ రెహ్మాన్, ఆయన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. రెహ్మాన్ ఆ ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. చాలా కాలంగా పార్టీలో వివిధ కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనను ఖండించారు .బెంగాల్లో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల భద్రత, స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కును హరిస్తున్నా్యని అన్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక, న్యాయమైన దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?