హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
USA: రోడ్డుపై జరిగిన చిన్న వివాదం ఓ భారతీయ యువకుడి హత్యకు కారణమైంది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల గవిన్ దసౌర్‌గా గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓవర్‌టేక్ చేసేందుకు బైక్‌కు దారివ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడ్డారు. అనంతరం ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపారు.
Communal Tension: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో మత ఉద్రిక్తతలు ఏర్పడింది. రామ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు మోటార్ సైకిళ్ల యాక్సిడెంట్ తరువాత ఒక గుంపు తీవ్రంగా కొట్టడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన శనివారం నగరంలో ఉద్రిక్తతను పెంచింది. అయితే అవగాహన లోపంతో ఇది జరిగిందని సిటీ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు.
దేశ రాజధానిలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. గురువారం రద్దీగా ఉండే పశ్చిమ ఢిల్లీ పరిసరాల్లో ఒక వ్యక్తిని కారు బానెట్‌పై అర కిలోమీటరు దూరం లాక్కెళ్లారు.