Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
- పని స్థలంలో వేధింపులకు మహిళ బలి.. నాలుగు నెలలుగా వీక్లీ ఆఫ్ లేకుండా వేధింపులు.. చివరకు ఆత్మహత్యకు పాల్పడిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Workplace Harassment: ఆఫీసులో వేధింపులకు ఒక మహిళ బలైంది. కర్ణాటక మైసూర్‌కు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో ఉద్యోగం చేసే చోట ఎదురైన వేధింపులే కారణమని ఆరోపించింది. మృతురాలిని న్యాగేశ్వరిగా గుర్తించారు. ఆమె హినకల్‌లోని రిలయన్స్ మార్ట్‌లో టాటా ప్రోడక్ట్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నారు. మార్కెటింగ్ సంస్థ పీపీఎంఎస్ ఎజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరినట్లు సమాచారం.
గత 15 రోజులుగా న్యాగేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉద్యోగ ప్రదేశంలో తనను వేధిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. తన తప్పు లేకపోయినా సీనియర్లు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మృతురాలు సూసైడ్ నోట్లో ఆరోపించినట్లు కుటుంబీకులు తెలిపారు. నాలుగు నెలలుగా వారానికి ఒక్క సెలవు కూడా ఇవ్వలేదని, అత్యవసర సెలవు అడిగినా అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించింది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
న్యాగేశ్వరి తన సూసైడ్ నోట్లో సూపర్ వైజర్ డాలీ పేరును ప్రస్తావించిందని తల్లి రత్నమ్మ తెలిపారు. పనిస్థలంలో వేధింపులే తన కుమార్తెను బలితీసుకున్నాయని ఆమె ఆరోపించారు. చిన్న చిన్న విషయాలకు కూడా తన కుమార్తెను వేధించేవారని చెప్పారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?