Gwalior Murder: గ్వాలియర్ రోడ్‌పై దారుణం.. లివ్-ఇన్ భాగస్వామిని పాయింట్-బ్లాంక్‌లో కాల్చిచంపిన కాంట్రాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gwalior Murder: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని అతి దారుణంగా కాల్చిచంపాడు. అరవింద్.. రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్‌నర్ నందినిని ఆపి.. ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత రక్తంతో తడిసి, బాధతో విలవిలలాడుతున్న నందిని పక్కనే కూర్చుని తన తుపాకీని ఊపుతూ అటువైపుగా వెళుతున్నవారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి.. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు..
READ ALSO: Robbery : హైదరాబాద్ శివారులో 40 లక్షల దోపిడీ.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.!
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
నిందితుడు అరవింద్‌ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో విలవిలలాడుతున్న నందినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో తమను బెదిరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరవింద్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడని.. గతంలో నందినితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు కూడా తీసుకున్నారని తెలిపారు. అరవింద్ తన మొదటి వివాహాన్ని, పిల్లలున్నారనన్న సంగతిని దాచిపెట్టి, నందినిని ఆర్య సమాజ్‌లో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయన్నారు. అయితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్‌పై నందిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి…
2024, నవంబర్‌లో అరవింద్ అతని స్నేహితురాలు పూజ పరిహార్‌తో కలసి తనపై దాడి చేశాడని నందిని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుంచి బయటపడింది. ఆమె ఫిర్యాదుతో అరవింద్‌ను అరెస్టు చేసినప్పటికీ.. ఆ తరువాత బెయిల్ పొంది.. నందినిని వేధిస్తూ వచ్చాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్‌పై పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపై ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.. నందిని మరోసారి ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా.. అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కళకళలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదేపదే పోలీసు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు.. అదీ వీఐపీ జోన్‌లో చోటుచేసుకున్న దారుణం అందరినీ కలచివేస్తోంది. మహిళల రక్షణపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది..
READ ALSO: Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బంధువుల ఇంట్లో చోరీ..
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!