Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- పెళ్లైన మూడు నెలలకే
- భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి
- కాల్చిచంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మరో దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. పెళ్లై కేవలం మూడు నెలలే అయిన భార్యను భర్త తన ప్రియురాలి సహాయంతో కాల్చిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఇద్దరూ నేపాల్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన హర్యానాలోని మనేసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
భార్య అదృశ్యంపై తల్లి ఫిర్యాదు
పోలీసుల వివరాల ప్రకారం, 22 ఏళ్ల యువతికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మనేసర్‌కు చెందిన అంకిత్‌తో వివాహం జరిగింది. అయితే మే 21న యువతి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బంధువులు, అత్తింటి వారిని సంప్రదించినప్పటికీ సరైన సమాచారం లభించలేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన యువతి తల్లి మే 22న మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
గదిలో మృతదేహం లభ్యం
దర్యాప్తులో భాగంగా పోలీసులు మనేసర్‌లోని ఓ అద్దె గదిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్లు నిర్ధారణ కావడంతో కేసులో హత్య సెక్షన్లు చేర్చి విచారణను ముమ్మరం చేశారు.
భర్త, ప్రియురాలు అరెస్ట్
దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితుడు అంకిత్‌తో పాటు అతని ప్రియురాలు రాజ్‌ని దేవిని అరెస్ట్ చేశారు. అంకిత్ మనేసర్‌లో పొగాకు దుకాణం నిర్వహిస్తుండగా, రాజ్‌ని అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మూడేళ్ల ప్రేమ.. హత్యకు పక్కా ప్రణాళిక
పోలీసుల విచారణలో అంకిత్, రాజ్‌ని గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. తమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించిన ఇద్దరూ హత్యకు ముందే ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు అంకిత్ తన భార్యను రాజ్‌ని అద్దెకు ఉంటున్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.
రెండు నెలల ముందే తుపాకీ కొనుగోలు
హత్య కోసం ఉపయోగించిన ఆయుధాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రెండు నెలల ముందే కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యను అమలు చేయడానికే ముందస్తుగా ఆయుధాన్ని సమకూర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత అంకిత్, రాజ్‌ని మొదట హరిద్వార్‌కు వెళ్లి, అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం అక్కడే తలదాచుకున్న ఇద్దరూ జూన్ 30న తిరిగి భారత్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా మనేసర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
పోలీసు కస్టడీలో నిందితులు
అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. హత్యకు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకోవడం, ఇతర ఆధారాలు సేకరించడం కోసం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!