Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- పెళ్లైన రెండు నెలలకే నవవధువు అనుమానాస్పద మృతి.
- భవనం బయట ఆకృతి మృతదేహం లభ్యం.
- కట్న వేధింపులు, హత్య ఆరోపణలు చేసిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో నవవధువు మృతి అనుమానాస్పదంగా మారింది. పెళ్లైన రెండు నెలలకే 28 ఏళ్ల ఆకృతి బిల్డింగ్ పైనుంచి కింద పడి మరణించింది. ఆమె ఎలా కిందపడిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఢిల్లీలోని లోధికాలనీలో చోటుచేసుకుంది. పాలికాకుంజ్లోని ఎన్డీఎంసీ ఫ్లాట్ల భవనం బయట నేలపై ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆకృతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. ఆమె మృతికి భర్త, అత్తమామలే కారణమని ఆరోపించారు. దీనిని హత్యగా చిత్రీకరించేందుకు ఆమె అత్తమామలు ప్రయత్నిస్తున్నారని ఆకృతి సోదరులు ఆరోపించారు. ఆకృతి మానసికంగా దృఢమైన వ్యక్తి అని, ఆమె ఆత్మహత్యకు పాల్పడే అవకాశమే లేదని చెబుతున్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఆకృతితో మాట్లాడినప్పుడు, తాను ఆఫీసు నుండి బయలుదేరానని చెప్పిందని, ఆతర్వాత కొద్దిసేపటికే ఆమె ఫోన్లో అందుబాటులో లేకుండాపోయిందని చెప్పారు. పుష్ప్ విహార్‌లోని ప్రభుత్వ ఫ్లాట్లలో నివసిస్తున్న కార్మిక శాఖలోని ఒక సెక్షన్ ఆఫీసర్ కుమారుడిని ఆకృతి వివాహం చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పుష్ప్ విహార్‌కు చెందిన ఆకృతి ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం చేసుకుంది. ఆమె ఛత్తర్పూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతిపై మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశాలు కోరినట్లు తెలిపారు. ప్రమాదమా, ఆత్మహత్యా, లేక హత్యా అనే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!