Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
- భర్తకు 20 నిద్రమాత్రలు ఇచ్చి హత్య..
- బాత్రూమ్ కింద పూడ్చిపెట్టిన భార్య..
- సంచలనంగా ఆగ్రా మర్డర్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా హత్య కేసు సంచలనంగా మారింది. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కనిపించకుండాపోయాడని నాటకాలు ఆడుతున్న భార్య భాగోతం బయటపడింది. భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 45 రోజుల తర్వాత ఈ హత్య బయటపడింది. మృతుడిని సురేంద్ర శర్మగా గుర్తించారు. నిందితురాలైన అతడి భార్య రూబీ శర్మను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.పోలీసులు విచారణలో రూబీ శర్మ కీలక వివరాలను వెల్లడించింది. తన భర్తకు ఆహారంలో 15-20 నిద్రమాత్రలు కలిపి తినిపించినట్లు వెల్లడించింది. మత్తులోకి వెళ్లిన తర్వాత హత్య చేసి, బాత్రూమ్ టైల్స్ కింద పూడ్చి పెట్టింది. తన భర్త కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ, పొరుగువారి ముందు ఏడుస్తూ అందర్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన అదే రోజు ఉదయం రూబీ తన బావ అనిల్ శర్మకు ఫోన్ చేసి, “అమ్మను, పిల్లలను తీసుకెళ్లండి… కానీ ఇంట్లోకి మాత్రం రావద్దు” అని చెప్పింది. ఆ సమయంలో ఇది సాధారణంగా అనిపించినప్పటికీ, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పిందో అర్థమైందని చెప్పాడు. రూబీ మృతదేహం కోసం ముందుగా తవ్వని గుంతలో పూడ్చిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మే 26న సురేంద్ర కనిపించడం లేదని రూబీ, ఆమె బావతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
సురేంద్ర సోదరుడు అనిల్ శర్మకు రూబీ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ, బ్యాంక్ లావాదేవీలతో పాటు ఇతర వివరాలను పరిశీలించాడు. చివరకు జూలై 3న రూబీ స్వయంగా అనిల్‌కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. సురేంద్రను బాత్రూంలో పాతిపెట్టినట్లు చెప్పింది. అయితే ఈ నేరంలో మరెవరైనా సహకరించారా? గుంత ఎవరు తవ్వారు? మృతదేహాన్ని పాతిపెట్టడంలో ఇంకెవరైనా పాత్ర ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!