ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Filing AY 2026-27: ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందని భావించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయకుండా ఉండాలనుకుంటే ఒకసారి నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా ITR దాఖలు చేయడం తప్పనిసరి. నిబంధనలు పాటించకపోతే నోటీసులు, జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మినహాయింపు పరిమితి ఎంత?
2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.4 లక్షల వరకు ఉన్నవారికి సాధారణంగా ITR దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పాత పన్ను విధానంలో ఈ ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ పరిమితికి లోబడినా ITR తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.
Also Read
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
ఈ పరిస్థితుల్లో ITR తప్పనిసరి
1. విదేశీ ఆస్తులు ఉంటే: భారతీయ నివాసితులు విదేశాల్లో ఆస్తులు, ఆర్థిక పెట్టుబడులు కలిగి ఉన్నా లేదా విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం ఉన్నా ITR దాఖలు చేయాలి.
2. భారీ విలువైన బ్యాంకు లావాదేవీలు: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో ఏడాదిలో రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు జమ చేసినా, సేవింగ్స్ ఖాతాల్లో రూ.50 లక్షలకు పైగా డిపాజిట్లు చేసినా ITR దాఖలు చేయడం తప్పనిసరి.
3. విదేశీ ప్రయాణాలు, అధిక విద్యుత్ బిల్లులు: ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినా లేదా విద్యుత్ బిల్లులు రూ.1 లక్షకు మించి చెల్లించినా ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది.
4. వ్యాపారం, వృత్తి ఆదాయం: వ్యాపార టర్నోవర్ రూ.60 లక్షలకు మించి ఉంటే లేదా వృత్తిపరమైన (ప్రొఫెషనల్) స్థూల రసీదులు రూ.10 లక్షలకు మించి ఉంటే ఆదాయం మినహాయింపు పరిమితిలో ఉన్నప్పటికీ ITR తప్పనిసరిగా దాఖలు చేయాలి.
5. TDS లేదా TCS నిర్దిష్ట పరిమితి దాటితే: ఆర్థిక సంవత్సరంలో మొత్తం TDS లేదా TCS రూ.25 వేలకుపైగా ఉంటే ITR దాఖలు చేయాలి. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ పరిమితి రూ.50 వేలుగా నిర్ణయించారు.
నిబంధనలు పాటించకపోతే?
పైన పేర్కొన్న నిబంధనల్లో ఏదైనా వర్తిస్తే ITR దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడంతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. అందువల్ల ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా, ఈ ప్రత్యేక నిబంధనలు మీకు వర్తిస్తున్నాయో లేదో ఒకసారి పరిశీలించి ITR దాఖలు చేయడం ఉత్తమం. కాగా, ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి సాధారణ పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీ జూలై 31, 2026గా ఉంది.. ఈ గడువులోగా రిటర్నులను ఆన్లైన్ పోర్టల్ ద్వారా దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది..
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?