Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరేసిన కేటుగాడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యువతులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్నారు. ఆ యువకుడి పేరు మహమ్మద్ షాజాద్ గా గుర్తించారు. బీహార్, పాట్నా జిల్లా, పలిగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాజాద్ ఆలం.. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సోషల్ మీడియాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌నంటూ పలు ఫోటోలు, వీడియోలు పంచుకున్నాడు.
Hyderabad Cyber Fraud: అర్ధ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. తాజాగా హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్‌ను సైబర్…