హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్‌తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత రిషబ్ శెట్టితో జై హనుమాన్ స్టార్ట్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్శ్ లో భాగంగా మహాంకాళిని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు స్టోరీని అందిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
Malluwood: వరంగా మారుతున్న చిన్న బడ్జెట్ సినిమాలు
ఇదే కాకుండా అంతకు ముందే ఎనౌన్స్ చేసిన అధిర ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో డెబ్యూ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మా రాక్షస మాత్రం సెట్ కాలేదు. రణవీర్ సింగ్ నుండి క్విటైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రభాస్ చెంతకు వచ్చిందన్న టాక్ వచ్చింది. కానీ బాహుబలి నుండి భళ్లాల దేవకు చేరిందని సమాచారం. టాలీవుడ్ హల్క్ రానాకు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్నర్ టాక్. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే బ్రహ్మా రాక్షసలో దగ్గుబాటి వారసుడు టైటిల్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. బాహుబలి, వెట్టయాన్ తర్వాత మరోసారి రానా ప్రతినాయకుడిగా ఆకట్టుకోబోతున్నాడన్న మాట.. మరీ ప్రశాంత్ వర్మ తాను అనుకున్న స్టోరీకి సరైన హీరో దొరికినట్లేనా..? అనేది చూడాలి.