Shehbaz Sharif: మొన్నటికి మొన్నే తమకు బుద్ధి వచ్చిందని, భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నామని పాక్ ప్రధాని షెబాజ్ షెరీఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా భారత్‌పై బెదిరింపులకు దిగారు. ‘‘పాకిస్తాన్ వద్ద అణ్వాయుధం ఉంది. కాబట్టి, భారత్ తమపై డేగకన్ను వేయలేదు. ఒకవేళ డేగకన్ను వేస్తే.. భారత్‌ని తన పాదాల కింద నలిపేసే శక్తి పాకిస్తాన్‌కి ఉంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పర్యటించిన ఆయన.. ఆ సమయంలోనే పై విధంగా స్పందించాడు.
Ponnam Prabhakar: రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను కేసీఆర్ బలి చేస్తున్నారు
అంతేకాదు.. కశ్మీర్ ఇష్యూని షెబాజ్ మరోమారు తెరమీదకి తీసుకొచ్చారు. కశ్మీరులకు స్వేచ్ఛ దక్కాలంటే.. ఆర్థిక, రాజకీయ స్థిరత్వం పొందాలని పేర్కొన్నాడు. అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని.. రాజకీయ, దౌత్య, నైతిక సాయం అందిస్తామని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా.. అణచివేతకు గురైన కశ్మీరి సోదరులు, సోదరీమణులకు పాకిస్థాన్ మొత్తం అచంచలమైన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసేందుకు కలిసి వస్తోందని ట్వీట్ చేశాడు. భారత్ నుంచి విముక్తి పొందాలన్న కలను సాకారం చేసుకునేందుకు కశ్మీరి ప్రజలు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, తమ త్యాగాల ద్వారా స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారని అన్నాడు. కశ్మీరి ప్రజల కలలు త్వరలోనే సాకారమవుతాయని చెప్పి.. తమ వక్రబుద్ధిని షేబాజ్ చాటుకున్నాడు.
Babu Mohan: బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం
అయితే.. జనవరి ప్రారంభంలో దుబాయ్‌కి చెందిన ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని షెబాజ్ పేర్కొన్నారు. ‘‘భారత్‌తో మూడుసార్లు యుద్ధం చేశాకే మేము మా గుణపాఠం నేర్చుకున్నాం. మా సమస్యలను పరిష్కరించుకోగలిగితే, భారత్‌తే శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము’’ అని అన్నారు. కశ్మీర్ వంటి బర్నింగ్ పాయింట్స్‌పై ప్రధాని నరేంద్ర మోడీతో నిజాయితీగా చర్చలు జరపాలని ఉంది కూడా తెలిపారు. అనవసరంగా గొడవ పడుతూ.. సమయం, వనరుల్ని వృధా చేసుకోకూడదని అనుకుంటున్నామని.. చర్చల కోసం మోడీకి ఇదే తన సందేశమని అన్నారు.