ఎన్ని స్పెషల్ రోజులు ఉన్నా ఏం లాభం.. మహిళకు న్యాయం మాత్రం జరగడం లేదు ఈ సమాజంలో.. చిన్నా పెద్ద అని కూడా చూడకుండా మగాళ్లు కామవాంఛతో మృగాళ్ళుగా మారుతున్నారు. మహిళా దినోత్సవమని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూనే రోడ్డు మీద అమమయిలను ఏడిపిస్తున్నారు. తాజాగా ఒక కామాంధుడు.. బాలిక అని కూడా చూడకుండా ఆమెపై దారుణానానికి పాల్పడ్డాడు. మహిళా దినోత్సవం రోజే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
రాజస్థాన్‌లోని పాలికి సమీపంలో నిన్న ఒక బాలిక స్కూల్ కి వెళ్లి వస్తుండగా వర్షం పడింది. దీంతో తడవకుండా ఉండడానికి పక్కనే ఉన్న చెట్టు వద్ద ఆగింది. అదే సమయానికి ఒక యువకుడు బైక్ పై వచ్చి బాలిక పక్కన నిలబడ్డాడు. కొద్దిసేపు బాలికతో మాటలు కలిపి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను నగ్నంగా మార్చి ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అపస్మారక స్థితిలకి వెళ్ళిపోయింది. సాయంత్రం అయినా బాలిక ఇంటికి చేరుకోకపోయేసరికి కుటుంబ సభ్యులు గాలించగా చెట్టు కింద నగ్నంగా కనిపించింది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.