US India trade deal: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల అధికారులు విస్తృతంగా పనిచేస్తున్నారు. ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’ నిర్ణయంతో భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్‌కి ప్రాధాన్యత ఇస్తోంది. ఇదిలా ఉంటే.. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి ఆన్లైన్ రిటైలర్లకు భారత మార్కెట్‌లో పూర్తి ప్రవేశాన్ని ఇవ్వాలని మన దేశంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, లాబీయిస్టులు, యూఎస్ ప్రభుత్వ అధికారుల్ని ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం నివేదించింది.
అమెజాన్, వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్ అయిన ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ వంటి భారతీయ పోటీదారులతో సమాన స్థాయి కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశంలో $125 బిలియన్ ఈ-కామర్స్ మార్కెట్ లోకి ఎక్కువ యాక్సెస్ కావాలని వాషింగ్టన్, న్యూఢిల్లీపై ఒత్తిడి చేస్తుంది.
Read Also: Rajanna Sircilla District: పంచాయతీ సెక్రెటరీ మిస్సింగ్.. ఓ పార్టీకి చెందిన నాయకుడి టార్చర్తోనే..
ప్రస్తుతం భారతదేశం విదేశీ యాజమాన్యంలోని ఆన్లైన్ రిటైలర్లపై ఆంక్షలు విధిస్తోంది. ఇన్వెంటరీ కలిగి ఉండటంతో పాటు, వినియోగదారులకు నేరుగా అమ్మడంపై నిషేధాలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, రిలయన్స్ వంటి దేశీయ కీ ప్లేయర్లకు ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ రెంటింటిలోనూ వీరికి అనుమతి ఉంది. ఒక వేళ వాల్‌మార్ట్, అమెజాన్‌లకు భారత్ మార్కెట్ ఫుల్ యాక్సెస్ ఇస్తే, ఇవి నేరుగా దుకాణాలు తెరిచి దేశవ్యాప్తంగా వినియోగదారులను చేరుకోవడానికి విస్తారమైన రిటైల్ నెట్వర్క్‌ని ప్రారంభిస్తాయి.
ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆహారం, ఆటోమొబైల్స్ నుంచి డిజిటల్ ట్రేడ్ వంటి విస్తృత శ్రేణి రంగాలను కవర్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిణామాలపై అమెజాన్, వాల్ మార్ట్ స్పందించలేదు.