US India trade deal: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల అధికారులు విస్తృతంగా పనిచేస్తున్నారు. ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’ నిర్ణయంతో భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్‌కి ప్రాధాన్యత ఇస్తోంది. ఇదిలా ఉంటే.. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి ఆన్లైన్ రిటైలర్లకు భారత మార్కెట్‌లో పూర్తి ప్రవేశాన్ని ఇవ్వాలని మన దేశంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, లాబీయిస్టులు, యూఎస్ ప్రభుత్వ అధికారుల్ని ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం…
USA: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్లపై విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాడు. ఇదిలా ఉంటే, వలసదారుల అణిచివేతలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో చర్యను తీసుకుంది.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే,
అమెరికా ఫెడరల్ రిజర్వ్ గురువారం వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. 2024లో వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. ద్రవ్యోల్బణం ఇప్పుడు నియంత్రణలోకి వస్తుందని ఫెడ్ అభిప్రాయపడింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై 48 గంటలు కూడా గడవని తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.