Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారిని మిస్సింగ్ లెటర్ జిల్లాలో కలకలం రేపుతుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కనిపించకుండా పోయి తన తండ్రికి పంపిన లెటర్ వారిని తీవ్ర భయందోళనకు గురి చేస్తుంది. అయితే, ఓ పార్టీకి చెందిన స్థానిక నాయకుడి వల్ల విధులు చేయలేక పోతున్నాను అని కుటుంబ సభ్యులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు.
Read Also: Home Minister Anita: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు..
అయితే, సోమవారం రోజున జిల్లా పంచాయతీ అధికారికి, తంగళ్లపల్లి ఎంపీడిఓకి తన రాజీనామా లెటర్ ను పంచాయతీ సెక్రటరీ ప్రియాంక వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో డీఎస్పీ కార్యాలయంలో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక మొబైల్ నెంబర్ ట్రెస్ చేయగా.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సహకారంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఏపీకి బయలుదేర వెళ్లారు.