ఓటీటీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. తమకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను ఓటీటీల్లోనే చూస్తున్నారు. అయితే ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే కొంత ఎమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు ఇప్పుడు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూడొచ్చు. ఏకంగా 84 రోజుల పాటు ఫ్రీగా చూడొచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? జియో, ఎయిర్‌టెల్, విఐ అందించే రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్నట్లైతే నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వం పొందొచ్చు. ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read:Sudeep : హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు
జియో రూ.1299 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 2GB డేటా (మొత్తం 168GB), అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 100 SMSలు వస్తాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ఉచిత సభ్యత్వం ఉంటుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంది.
Also Read:Group-2 Mains: సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..
జియో రూ.1799 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 3GB డేటాను (మొత్తం 252GB) అందిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను ఇస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వం ఉంటుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంది.
Vi యొక్క రూ. 1599 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 2.5GB డేటాను (మొత్తం 210GB), అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.
Also Read:PM Modi: కుంభమేళాపై ప్రతిపక్షాలది ‘‘బానిస మనస్తత్వం’’.. మోడీ ఆగ్రహం..
ఎయిర్‌టెల్ రూ. 1798 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 3GB డేటాను (మొత్తం 252GB) అందిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్ యొక్క ఉచిత సభ్యత్వం ఉంటుంది. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్ అలర్ట్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.