Sudeep : హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudeep : శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో విలన్ గా గుర్తుండిపోయాడు ఆయన. ఈగ మూవీలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ సినిమా తర్వాత సుదీప్ కన్నడలో చేసిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన సుదీప్ ఆ తర్వాత నుంచి తెలుగు సినిమాల్లో కనిపించలేదు. తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయకపోయినా ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడలో సుదీప్ స్టార్ హీరోగా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Read Also:Group-2 Mains: సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇటీవల ఆయన నటించిన మ్యాక్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కన్నడ బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు సుదీప్. రీసెంట్ గానే ఓ సీజన్ ను ముగించిన సుదీప్ స్క్రీన్ పై ఎంతో ఫిట్ గా కనిపిస్తాడు. ఆయన వయసు 52 సంవత్సరాలంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు 52 ఏళ్ల సుదీప్ కు 21ఏళ్ల కూతురు కూడా ఉంది. సుదీప్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి కన్నడ ఆడియెన్స్ కు మాత్రం బాగా తెలుసు. సుదీప్ కూతురి పేరు సాన్వీ సుదీప్. సోషల్ మీడియాలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు సాన్వీ సుదీప్ పేరు కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.
Read Also:Crime: వేరే వ్యక్తితో యువతి రిలేషన్.. స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడు గ్యాంగ్ రేప్..
ఇప్పటికే తన అందాలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న సాన్వీ సుదీప్, త్వరలోనే సినిమాల్లోకి రానుందని కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాన్వీకి యాక్టింగ్ కంటే సింగింగ్ అంటేనే ఇష్టమని.. ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పింది. అందులో భాగంగానే అమ్మడు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆల్రెడీ సాన్వీ జిమ్మీ అనే సినిమాలో ఓ పాట కూడా పాడుతుందట. హీరోయిన్ గా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!