Stock Market Crash: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. నేడు ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. వారం ఆరంభం నుంచి ఊగిసలాడుతున్న మార్కెట్, గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీలు.. సమయం గడిచే కొద్దీ మరీ దారుణంగా పడిపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,247 పాయింట్లు పతనమై 73,580 స్థాయి వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఏమాత్రం కోలుకోలేక 383 పాయింట్లు నష్టపోయి 23,063 వద్ద ముగిసింది. ఈ భారీ పతనం వల్ల ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఉదయం నుంచే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. క్రితం రోజు 74,828 వద్ద ముగిసిన సెన్సెక్స్, ఆరంభంలోనే భారీ పతనంతో 74,272 వద్ద మొదలైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లేకపోవడంతో మరింత దిగజారి, చివరికి 1.67 శాతం అనగా 1,247 పాయింట్ల నష్టంతో 73,580.54 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ పరిస్థితి కూడా ఇలాగే సాగింది. బుధవారం 23,446 వద్ద ముగిసిన నిఫ్టీ, గురువారం 23,221 వద్ద ప్రారంభమై.. చివరికి 1.64 శాతం అనగా 283.70 పాయింట్లు క్షీణించి 23,063.10 వద్ద ఆగిపోయింది.
ఈ పతనం ఇన్వెస్టర్ల జేబులకు పెద్ద కన్నమే వేసింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE MCap) ఆధారంగా ఈ నష్టాన్ని అంచనా వేయవచ్చు. అంతకంటే ముందు రోజు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 4,85,01,353.85 కోట్లుగా ఉంటే, గురువారం నాటి పతనం తర్వాత అది రూ. 4,80,99,180.54 కోట్లకు పడిపోయింది. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన దాదాపు రూ. 4,02,173 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. సూచీలు మాత్రమే కాకుండా ప్రధాన కంపెనీల షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్‌లో ఉన్న ‘పాలసీ బజార్’ షేరు ఏకంగా 35.98 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. వీటితో పాటు MFSL షేరు 9.81 శాతం, ఏయూ బ్యాంక్ 4.95 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 4.70 శాతం చొప్పున పతనమై తీవ్ర నష్టాలతో ముగిశాయి.
Also Read
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
- Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
తాజావార్తలు
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. నేడు ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!