Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Prices: క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతాయేమోనని అందరిలోనూ రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల మన దేశీయ ఆయిల్ కంపెనీలు రోజుకు దాదాపు రూ. 530 కోట్లతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సాధారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరిగినప్పుడు మన దగ్గర కూడా ఇంధన ధరలను పెంచడం సహజం. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదా ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టత రావడంతో వాహనదారులకు పెద్ద ఉపశమనమే లభించింది. ఈ మధ్య కాలంలో భారతీయ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బారెల్‌కు ఏకంగా 115.27 డాలర్లకు చేరుకుంది.
ఇక, ఈ నెల సగటు ధర కూడా 114.83 డాలర్లుగా ఉంటూ రికార్డు స్థాయికి దగ్గరవుతోంది. నవంబర్‌లో జరగబోయే అమెరికా మిడ్-టర్మ్ ఎన్నికల నేపథ్యంలో ముడిచమురు మార్కెట్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశముంది. ఇది భారత దిగుమతుల బిల్లుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల వల్లే ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ (ICRA) అంచనా ప్రకారం.. ఇంధన విక్రయ సంస్థలు (OMCs) రోజువారీగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 9 చొప్పున మార్కెటింగ్ మార్జిన్లు మైనస్‌లోకి వెళ్లిపోగా, వాస్తవంగా పెట్రోల్‌పై కొన్ని రూపాయలు, డీజిల్‌పై ఏకంగా రూ. 23 వరకు నష్టం వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు వంటగ్యాస్ (LPG) సిలిండర్‌పై కూడా దాదాపు రూ. 300 వరకు రికవరీ లోటు నమోదవుతోంది.
Also Read
- Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
చమురు ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా సరఫరా నిలిచిపోవడమే. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్లు ఎక్కువగా వెళ్ళే అతిముఖ్యమైన మార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా నౌకల రాకపోకలకు అంతరాయం కలగడంతో గ్లోబల్ మార్కెట్లో కొరత ఏర్పడింది. అయితే ఈ సమస్యను పరిష్కరించి ఇంధన నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చలు జరుపుతోంది. ధరలు పెంచకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రధానంగా ఎనర్జీ సెక్యూరిటీపై దృష్టి పెట్టింది. మన దేశానికి నిరంతరం ఇంధన సరఫరా అందేలా చేయడం కోసం రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును కొనసాగించడంతో పాటు.. ఇరాక్, సౌదీ అరేబియాల నుంచి కూడా దిగుమతులు పెంచుకుని సరఫరా వనరులను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. ప్రజలపై భారం పడకుండా దేశీయంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచడం, నష్టాల్లో ఉన్న ఆయిల్ కంపెనీల ఆర్థిక పరిస్థితిని కాపాడటం, గ్లోబల్ టెన్షన్ల మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా క్రూడ్ ఆయిల్ దేశానికి వచ్చేలా చూడటం. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఆయిల్ కంపెనీలను ఆదుకోవడానికి ప్రభుత్వం సొంతంగా ఆర్థిక సాయం లేదా సబ్సిడీని అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!