Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఉదయం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, మధ్యాహ్నం 2 గంటల సమయానికి పేకమేడలా కుప్పకూలాయి. విచక్షణారహితంగా సాగిన అమ్మకాల ఒత్తిడికి మదుపరుల పోర్ట్‌ఫోలియోలు రక్తసిక్తమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు (1.65 శాతం) దిగజారి 73,604.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 375 పాయింట్లకు పైగా క్షీణించి 23,070.05 స్థాయికి పడిపోయింది. ఈ ఆకస్మిక పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
మార్కెట్‌ను ముంచేసిన ‘గ్లోబల్ క్రూడ్ బాంబ్’..
ఈ భారీ విధ్వంసానికి అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటడం మార్కెట్ సెంటిమెంట్‌ను కోలుకోలేని దెబ్బతీసిందని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా 106 డాలర్లను దాటడం భారత ఆర్థిక వ్యవస్థపై దిగుమతి భారాన్ని, ద్రవ్యోల్బణ ముప్పును పెంచింది. దీనికితోడు అమెరికా 10 ఏళ్ల బాండ్ల రాబడి 5.11 శాతానికి ఎగబాకడంతో విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి వేగంగా వెనక్కి మళ్లాయి. మరోవైపు కరెన్సీ మార్కెట్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. అమెరికన్ డాలర్ బలపడటంతో భారత రూపాయి విలువ మరో 11 పైసలు క్షీణించి 95.84 స్థాయికి పడిపోవడం మదుపర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. అంతర్జాతీయంగా ముడిచమురు సెగలు తగ్గనంత వరకు మార్కెట్లు నిలదొక్కుకోవడం కష్టమేనని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
బ్లూచిప్ కంపెనీల్లో రక్తపాతం..
ఈ పతనంలో మార్కెట్ దిగ్గజాలే పెద్ద దెబ్బ తిన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి భారీ వెయిటేజ్ ఉన్న షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్ వేగంగా పడిపోయింది. అయితే మార్కెట్ ఇంతలా కుదేలవుతున్న వేళ ఒక విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. బ్లూచిప్ కంపెనీలు చౌకగా దొరుకుతున్నా వాటిని వదిలేసి, రిటైల్, దేశీయ ఇన్వెస్టర్లు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్ల వైపు పరుగులు తీస్తున్నారు. దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి వస్తున్న లిక్విడిటీ చిన్న షేర్లకు రక్షణ కవచంలా నిలుస్తోంది. అయితే అధిక వాల్యుయేషన్లతో ఉన్న ఈ చిన్న కంపెనీలు రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ సంక్షోభాన్ని ఎంత వరకు తట్టుకుంటాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తాజావార్తలు
-
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
-
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
-
Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!