OnePlus Ace 2 Pro: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ల ఉపయోగం ఎక్కువగా ఉండటంతో.. తయారీ సంస్థలు కూడా అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. నెలల వ్యవధిలోనే కొత్త మోడల్స్ వస్తున్నాయి. కొత్త మోడల్స్ ను మార్కెట్‌లోకి తీసుకురావడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఒక కంపెనీ ఒక కొత్త మోడల్‌ను తీసుకొచ్చిందంటే.. మరొక కంపెనీ కూడా దానికంటే మంచి ఫీచర్స్, కొత్త మోడల్‌తో కొత్త స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తుంది. ఇలా నెలల వ్యవధుల్లోనే స్మార్ట్ ఫోన్లలో కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వన్ ప్లస్ కంపెనీ వన్ ప్లస్ యేస్2 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 24 జీబీతో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
Read also: Exercise:వర్షాకాలంలో వాకింగ్ చేయడం కుదరడం లేదా? ఇంట్లోనే ఇలా ఎక్సర్‌సైజ్ చేసుకోండి
స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ త్వరలో వన్ ప్లస్ ఏస్2 ప్రో (OnePlus Ace 2 Pro) ఫోన్ ఆవిష్కరించనున్నది. వన్‌ప్లస్ ఏస్1/ వన్‌ప్లస్ 11ఆర్ తో పోలిస్తే మరింత శక్తిమంతమైన ఫోన్‌గా నిలవనుందని సంస్థ ప్రకటించింది. ఆగస్టు 16న ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆన్ బోర్డ్ 24 జీబీ రామ్ విత్ ఒక టిగాబైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వన్‌ప్లస్ యేస్2 ప్రో వస్తోంది. ఇంత భారీ రామ్ కెపాసిటీతో వస్తున్న తొలి ఫోన్ వన్‌ప్లస్ యేస్2 ప్రో నే కావడం విశేషం. ఈ నెల 16 మధ్యాహ్నం చైనా మార్కెట్లోకి రానున్న వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ త్వరలో భారత్, గ్లోబల్ మార్కెట్లలోనూ అందుబాటులోకి రానుంది. వన్ ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ బయోనిక్ వైబ్రేషన్ సెన్సర్ మోటార్, అథంటికేషన్ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ -2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ 6.74 అంగుళాల 1.5 కే (1240×2772 పిక్సెల్స్) రిజొల్యూషన్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్+ సర్టిఫికేషన్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 150 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. 17 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇది మెరుగైన రంగు మరియు ఫోటో కెపాసిటీ కోసం BOE యొక్క Q9+ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. OnePlus Ace 2 Pro 150W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి స్తుంది. ఇది 24GB RAMతో పాటు స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో రన్ అవుతుంది.