RBI: రేపటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం..కీలక అంశాలపై చర్చ
- రేపటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
- ఆగస్టు 8 వరకు కొనసాగనున్న సమావేశం
- రుణాన్ని చౌకగా ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం
- గతేడాది ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి పెంచిన ఆర్‌బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఆగస్టు 8 వరకు జరగనుంది. ఈ సమావేశంలో రుణాన్ని చౌకగా ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతానికి పెంచింది. ఆ తర్వాత వరుసగా 7 ఎంపీసీ సమావేశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఎనిమిదో సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. రెపో రేటును మార్చవచ్చు, రుణాలు చౌకగా చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గవచ్చని అంచనా.
READ MORE: US Recession : అమెరికాపై మాంద్యం నీడ.. ప్రమాదంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఆర్థిక విషయాలపై నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమావేశంలో రుణాలను చౌకగా చేసే నిర్ణయంపై చాలా తక్కువ ఆశ ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దాదాపు 4 శాతానికి తగ్గించే బాధ్యతను ఆర్‌బీఐకి కేంద్రం అప్పగించింది. జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 5.08 శాతానికి చేరుకుంది. ఇది వరుసగా 57వ నెలలో లక్ష్యం 4% కంటే ఎక్కువగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం వరుసగా 8 నెలలుగా 8% కంటే ఎక్కువగా ఉంది.
READ MORE:Success Story: హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇది జరుగుతుందా అనేది రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మోస్తరుగా కనిపించవచ్చు. అయితే ఇది ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ కారణంగా ఉంటుంది. అందువల్ల రేట్ల తగ్గింపు నిర్ణయం ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదు. ఇది అక్టోబర్‌లో పరిగణించబడుతుంది. అధిక రెపో రేటు 6.5 శాతం మధ్య కూడా జీడీపీ వృద్ధి బలంగా ఉంది . 2024 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధి తర్వాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతం వరకు ఉండవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్‌బీఐ 7.2 శాతం వృద్ధిని అంచనా వేసింది. వృద్ధి మందగమనం కారణంగా రేట్లు తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతుంది. బీఓబీ ఆర్థికవేత్త అదితి గుప్తా మాట్లాడుతూ, ‘ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎక్కువ కాలం తగ్గుతుందనే విశ్వాసం వచ్చే వరకు రేట్లను ప్రస్తుత స్థాయిలో ఉంచడానికి RBIకి బలమైన వృద్ధి అవకాశం కల్పించింది.” అని అన్నారు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!