US Recession : అమెరికాపై మాంద్యం నీడ.. ప్రమాదంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Recession : ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందా? లేదా ఆర్థిక వ్యవస్థ కేవలం గడ్డు స్థానానికి చేరుతోందా? యునైటెడ్ స్టేట్స్లో ఇటీవలి ఆర్థిక సూచికలు వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉండవచ్చని పలువురు విశ్లేషకులు చెప్పడంతో ఆ దిశలో ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మంది విశ్లేషకుల మాంద్యం ఊహాగానాల మధ్య, ఇప్పుడు గోల్డ్‌మన్ సాక్స్ కూడా భయాలను పెంచింది. గోల్డ్‌మన్ సాచ్స్ వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం గురించి దాని అంచనాలను పెంచింది.
Read Also:Success Story: హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇంక్.లోని ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం అంచనాను 15 శాతం నుండి 25 శాతానికి పెంచారు. అయితే ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ ఒక్కసారిగా పెద్దగా నష్టపోయే ప్రమాదం లేదు. గోల్డ్‌మన్ సాచ్స్‌లోని ఆర్థికవేత్తలు మాంద్యం ప్రమాదం పెరిగడానికి నిరుద్యోగం పెరగడం ప్రధాన కారణమని తెలుపుతుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆందోళనకర గణాంకాలు గత వారం అమెరికాలో వెల్లడయ్యాయి. అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకుంది. అక్టోబర్ 2021 తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద నిరుద్యోగ సంఖ్య. నిరుద్యోగిత రేటులో ఈ పెరుగుదల మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది. మాంద్యం భయాన్ని మరోసారి తీవ్రతరం చేసింది. నిరుద్యోగం విపరీతంగా పెరగడం రాబోయే మాంద్యంకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also:Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద..
అమెరికా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం
మాంద్యం ముప్పు ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 375 పాయింట్లకు పైగా (సుమారు 1 శాతం) తగ్గాయి. అంతకుముందు శుక్రవారం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 610.71 పాయింట్లు లేదా 1.51 శాతం పడిపోయింది. S&P 500 ఇండెక్స్ 1.84 శాతం నష్టంతో ఉండగా, టెక్ స్టాక్ ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్ కాంపోజిట్ 2.43 శాతం నష్టాల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద ఆర్థిక అసమతుల్యత లేదు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి చాలా అవకాశాలను కలిగి ఉంది.. అవసరమైతే, ఫెడరల్ రిజర్వ్ చాలా త్వరగా వడ్డీ రేట్లను తగ్గించవచ్చని గోల్డ్‌మ్యాన్ ఆర్థికవేత్తలు ఆదివారం ఒక నివేదికలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?