దివ్య ఫార్మసీ విక్రయిస్తున్న ఆయుర్వేద ఔషధాల ప్రకటనలపై బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కేరళలోని కోజికోడ్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లుజారీ చేసింది.
ఇది కూడా చదవండి: MLC Jeevan reddy: దీపాదాస్ మున్షీతో ముగిసిన జీవన్ రెడ్డి భేటీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..!
ఈ ఏడాది ప్రారంభంలో పతంజలి ఆయుర్వేదం ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణలకు కూడా సమన్లు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా కేరళ కోర్టు జారీ చేసింది. రామ్‌దేవ్, బాలకృష్ణలు జూలై 6న కోర్టుకు వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారంటూ పలువురు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలపై పిటిషన్లు వేశారు. ఇందులో భాగంగానే ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Viral Video: పార్లమెంట్‌లో కలిసిన హీరో హీరోయిన్లు.. వీడియో వైరల్