MLC Jeevan reddy: ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియా ప్రశ్నించగా.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనంటూ తెలిపింది. ఇక, మీడియాతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నిరాకరించారు. తర్వాత మాట్లాడతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, కొద్దీసేపటి తర్వాత, అలక వీడినట్లు ప్రకటించారు. పార్టీనే ముఖ్యం.. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవు.. మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీతో తెలుగు గవర్నర్ మనవరాళ్లు ముచ్చట్లు
ఇక, పార్టీలో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయని దీపాదాస్ మున్షీ పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గకుండా చూస్తాం.. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఎమ్ లేదు.. పీసీసీపై అధిష్టానం నిర్ణయం తిసుకుంటుంది.. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత ఆయనను కించపరచడం మా ఉద్దేశ్యం కాదు.. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వల్ల ఆయన అమర్యాదగా, ఆగౌరవంగా భావించారు.. కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపి ఏ నిర్ణయం తీసుకున్న ఆయనతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్సీ వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం కొనసాగుతుంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో.. ఢిల్లీకి జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.