చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ కీలక ప్రకటన చేసింది. 50 వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ నీతా అంబానీ.. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, మహిళలకు అవసరమైన స్క్రీనింగ్‌లు, చికిత్సలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించినట్లు ప్రకటించారు. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్, చికిత్స అందించనున్నారు. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు. అలాగే 10,000 మంది యుక్తవయస్సులోని బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వేస్తామని ప్రకటంచారు.
ఇది కూడా చదవండి: Madras High Court: ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం..
రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ అనేక సేవలు అందిస్తుంటారు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా పేద జంటలకు వివాహలు జరిపించారు. ఇలా అనేక మైన సేవా కార్యక్రమాల్లో నీతా అంబానీ ముందంటారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ప్రజా పాలన విజయోత్సవ వేడుకలపై సీఎం రేవంత్ సమీక్ష