ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సప్ ద్వారా డబ్బులు చెల్లించే, బదలాయించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఇందులోనే మారో ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయింది. క్రిప్టో కరెన్సీపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీ పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్నిలో భారీ పెట్టుబడులు పెడుతూ ప్రోత్సహిస్తున్నాయి.
Read: వాగులో పడ్డ ఆటో… 15 మంది గల్లంతు?
కాగా, ఈ బాటలో ఇప్పుడు వాట్సాప్ కూడా నడిచేందుకు సిద్దమైంది. నోవి పేరుతో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఎంపిక చేసిన యూజర్లకు నోవి బీటా వెర్షన్లకు అందిస్తుంది. నోవిలో అవసరమైన సమాచారాన్నిఅందించిన తరువాత వాలెట్‌లో కరెన్సీని ఉంచాలి. ఈ డబ్బును మెటా డిజిటల్ కరెన్సీగా మారుతుంది. ఆ డిజిటల్ కరెన్సీని క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించవచ్చు. నోవి డిజిటల్ క్రిప్టోకరెన్సీ వెర్షన్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అందుబాటులోకి తీసుకొస్తుంది.