F&O Trading Loss: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్ (F&O ట్రేడింగ్) చాలా ప్రమాదకర వ్యాపారం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కూడా ఎల్లప్పుడూ F&O ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా హెచ్చరిస్తూనే ఉంది. అయిన ఇప్పటికీ లక్షలాది మంది పెట్టుబడిదారులు ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండా F&O ట్రేడింగ్‌లో పాల్గొంటూ, గణనీయమైన నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పెట్టుబడిదారుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ మనోడి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan: ‘‘మజా రాకుంటే పైసల్ వాపస్’’.. పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
30 ఏళ్ల వ్యక్తి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో రూ.2 కోట్లకు పైగా నష్టపోయానని వెల్లడించాడు. ఈ వారం ప్రారంభంలో అతను రెడ్డిట్‌లో తాను నెలకు రూ.2.85 లక్షలు సంపాదిస్తున్నానని, కానీ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో రూ.2 కోట్లకు పైగా నష్టపోయానని, తనను తాను కాపాడుకోవడానికి అప్పు చేస్తున్నానని వెల్లడించాడు. తన అప్పును ఎలా తగ్గించుకోవాలో తెలియక, ఏమైనా మంచి ఐడియాలు ఉంటే చెప్పండి అంటూ ఈ పోస్ట్‌లో అతను నెటిజన్లను సహాయం అడిగాడు.
ఈ పోస్ట్‌లో అతను తన గురించి చెబుతూ.. తాను ఒక ప్రసిద్ధ కంపెనీలో పనిచేస్తున్నానని, నెలకు జీతం దాదాపు రూ.2.85 లక్షలు అని పేర్కొన్నాడు. “గత కొన్ని సంవత్సరాలుగా, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో నేను ఎక్కువగా నిమగ్నమై ఉన్నాను, దీనిని నేను “సైడ్ ఇన్వెస్ట్‌మెంట్”గా ప్రారంభించాను, కానీ క్రమంగా ఇది వ్యసనంగా మారిందని అని వివరించాడు. ఈ టైంలో తాను పెద్ద మొత్తంలో (రూ.2 కోట్లకు పైగా) డబ్బును కోల్పోయాను, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి, కొత్త అప్పులు చేస్తూనే ఉన్నాను. నేడు నా అన్‌సెక్యూర్డ్ అప్పు..
రూ.27 లక్షల వ్యక్తిగత రుణం
రూ. 28 లక్షల OD రుణం
రూ.8-9 లక్షల వరకు NBFCల రుణాలు
క్రెడిట్ కార్డు బకాయిలు రూ. 12 లక్షలు వరకు ఉన్నాయని వివరించాడు.
ఇంతకీ F&O ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసా..
స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్ కిందకు వస్తాయి. దీనిని సాధారణంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఈ రకమైన ట్రేడింగ్ షేర్లను కొనుగోలు చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. ఎందుకంటే దీంట్లో వ్యాపారులు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ కాంట్రాక్టులలో వర్తకం చేస్తారు. స్టాక్‌లను కొనడానికి బదులుగా, కాంట్రాక్టులను వేర్వేరు నెలలకు కొనుగోలు చేసి విక్రయిస్తారు. ఈ రకమైన ట్రేడింగ్ చాలా ఎక్కువ రిస్క్, రివార్డ్‌ను కలిగి ఉంటుంది. డబ్బు త్వరగా సంపాదించినప్పటికీ, అది అంతే త్వరగా కోల్పోవచ్చు కూడా మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Titan Share: మహిళా బిలియనీర్‌కు ఒక్క రోజులో రూ.800 కోట్లు తెచ్చిన టాటా షేర్లు..