Titan Share: స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడవుతోంది. అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే, ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఈ షేరు విలువ అపారంగా పెరగడంతో, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్వాలా భార్య బిలియనీర్ రేఖ జుంజున్వాలాకు ఒకేసారి దాదాపు రూ.800 కోట్ల సంపద కలిసి వచ్చింది.
READ ALSO: Curd In Winter: శీతాకాలంలో పెరుగు తినడం హానికరమా?.. అసలు నిజం ఏంటంటే?
టైటాన్ కంపెనీ షేరు మునుపటి ముగింపు రూ.4112తో పోలిస్తే, ఈ రోజు షేర్ విలువ బలమైన పెరుగుదలతో రూ.4225 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ షేర్ మరింత వేగంగా దూసుకుపోతూ రూ.4309.30 స్థాయికి చేరుకుంది. నిజానికి ఇది టైటాన్ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి. ఈ పెరుగుదల అనేది కంపెనీ మార్కెట్ క్యాప్‌పై కూడా సానుకూల ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ అనేది రూ.3.82 లక్షల కోట్లకు పెరిగింది. గత ఐదు సంవత్సరాలలో ఈ స్టాక్ రూ.2,754 లాభపడింది, అలాగే పెట్టుబడిదారులకు 178% రాబడిని అందించింది. టాటా స్టాక్ గత సంవత్సరంలో 23%, ఆరు నెలల్లో 18%, ఒక నెలలో 14% లాభపడిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ఇంత వేగంగా ఈ షేర్ వ్యాల్యూ పెరుగుదలకు గల కారణాల గురించి మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ.. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్టాండ్-ఎలోన్ ఆదాయంలో 40% కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం టైటాన్ తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ Q3లో వార్షిక ప్రాతిపదికన 41% వృద్ధిని నమోదు చేసిందని తెలియజేసింది.
దివంగత పెట్టుబడిదారు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలాకు టాటా గ్రూప్‌లోని టైటాన్ కంపెనీలో వాటా ఉంది. పలు నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 30, 2025 వరకు ఆమెకు ఈ కంపెనీలో 5.32% వాటా ఉంది. ఈ వాటాలో భాగంగా ఆమెకు 47,293,470 టైటాన్ స్టాక్‌లు ఉన్నాయి. నిన్నటి ట్రేడింగ్ రోజున స్టాక్‌లకు సంబంధించి ఆమె వాటా విలువ రూ.19,416 కోట్లుగా ఉండగా, బుధవారం పెరిగిన విలువతో వాటి వ్యాల్యూ రూ.20,212 కోట్లకు చేరుకుంది. ఆమె తక్కువ టైంలోనే రూ.800 కోట్లకు పైగా ఈ స్టాక్స్ ద్వారా సంపాదించిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
READ ALSO: Bollywood : బాలీవుడ్ కల్ట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్