క్రిప్టో కరోన్సీ… అనధికారికంగా ప్రపంచంలో చలామణి అవుతున్నది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో నడిచే ఈ క్రిప్టో కరెన్సీని ఎవరి అదుపులో ఉండదు. ఆయా దేశాల్లో కరెన్సీకి ఉన్న డిమాండ్ ఆధారంగా విలువ పెరుగుతుంది. అయితే, ఇండియాలో క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అధికారికంగా అనుమతించలేదు. ఇక ఇదిలా ఉంటే, హరిద్వార్ కేంద్రంగా నడిచే గురుకుల కంగ్రి అనే విద్యా సంస్థ క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ ఎక్స్ భాగస్వామ్యంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును అందించేందుకు సిద్ద మయింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ క్రప్టో కరెన్సీ కోర్సు పూర్తయిన తరువాత గురుకుల కంగ్రి సంస్థ సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది.
Read: తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది : కేటీఆర్
క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉందని చెప్పి ప్రముఖ వ్యాపరదిగ్గజాలు ఎలన్ మస్క్, ఆపిల్ కంపెనీ అధినేత టిమ్‌కుక్ వంటివారు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక అమెరికా తరువాత క్రిప్టో కరెన్సీవైపు చూస్తున్న వ్యక్తులు ఇండియాలోనే ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే,కేంద్రం ఇప్పటి వరకు క్రిప్టోకరెన్సీకి చట్టబద్దమైన అనుమతులు ఇవ్వలేదు. ఇక రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ కాయిన్ ను తీసుకురావాలని చూస్తున్నది. ఈ డిజిటల్ కాయిన్ టెక్నాలజీ ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.