తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది : కేటీఆర్‌

భూగర్భ జలాల సంరక్షణలో తెలంగాణ ఆదర్శప్రాయంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నేడు పచ్చని పొలాలు…పంటలు ఉన్నాయని ఆయన అన్నారు. పాలమూరుకు ఇప్పుడు వలస పోయిన కార్మికులు వెనక్కి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ పది నుంచి పదిహేను లక్షలు పలుకుతోందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి అమ్ముతామంటే కొనేవారు దిక్కులేరని.. ఇప్పుడు భూమి కొందామంటే.. అమ్మేవారు లేరని ఆయన పేర్కొన్నారు.

రైతుల ఆత్మహత్యలను తగ్గించడంలో తెలంగాణ ముందు ఉందని పార్లమెంట్ లో చెప్పారని ఆయన వెల్లడించారు. నాడు దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు…నేడు తెలంగాణ ముక్కోటి టన్నుల ధాన్యగారంగా మారిందని ఆయన తెలిపారు. తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles