మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 45,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 49, 100 కి చేరింది. ఇక బంగారం ధరలు తగ్గగా..వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదయ్యాయి. కిలో వెండి ధర రూ. 69,100 వద్ద కొనసాగుతోంది.