వెనిజులా సంక్షోభం మామూలుగా లేదు. గత ఏడాదంతా అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా బంగారం, వెండి ధరలు బెంబేలెత్తించాయి. కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయనుకుంటే లేటెస్ట్‌గా వెనిజులా సంక్షోభం ముంచుకొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు సునామీ సృష్టిస్తున్నాయి. దీంతో కొనాలంటేనే కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2, 83, 000 అమ్ముడవుతోంది. అతి త్వరలోనే రూ.3 లక్షల మార్కు చేరుకోనుంది. వెనిజులా సంక్షోభం కారణంగా బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,63, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,83,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,63, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Venezuela: వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన
ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.660 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.600 పెరగగా రూ.1,27,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరగగా రూ.1,04,610 దగ్గర ట్రేడ్ అవుతోంది.