గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వీకెండ్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.380 తగ్గగా.. కిలో వెండిపై రూ. 2,000 తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.380 తగ్గగా.. రూ.1,35,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.350 తగ్గగా రూ.1,24,500 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.280 తగ్గగా రూ.1,01,870 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Saudi-UAE War: పశ్చిమాసియాలో మరో ఉద్రిక్తత.. రెండు గల్ఫ్ దేశాల మధ్య తీవ్ర పోరు
ఇక వెండి ధర ఉపశమనం కలిగించింది. ఈరోజు కిలో వెండిపై రూ.2,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,56,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ఐసిస్ భారీ కుట్ర భగ్నం.. యువకుడు అరెస్ట్