పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం, సిల్వర్ ధరలు దిగొచ్చాయి. గత వారం వెండి ధరలు విశ్వరూపం సృష్టించాయి. దాదాపు 3 లక్షల చేరువకు వెళ్లిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.50,000 పెరిగిపోయింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్ప ఊరట కలిగించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.710 తగ్గగా.. కిలో వెండిపై రూ.4,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.710 తగ్గగా.. రూ.1,41,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.650 తగ్గగా రూ.1,29,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.540 తగ్గగా రూ.1,06,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: US: గగనతలంలో ప్రమాదం.. 2 హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్
ఇక సిల్వర్ ధర కూడా ఊరటనిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.4,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,58, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,81,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,58, 000 దగ్గర అమ్ముడవుతోంది.