పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. ఈ మధ్య పుత్తడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కొనాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి. ధరలు చూసి గుండె దడ పుడుతోంది. ఒకరోజు స్వల్పంగా తగ్గి.. ఇంకో రోజు భారీగా పెరిగిపోవడంతో గోల్డ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు. ఈరోజు మాత్రం తులం గోల్డ్‌పై రూ.660 తగ్గగా.. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Obama: ఈ ఏడాది ఒబామాను మెప్పించిన సినిమాలు ఇవే!
బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.660 తగ్గి.. రూ.1,34,180 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 600 తగ్గి రూ.1,23,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 తగ్గి రూ.1,00,640 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Kristin Cabot: కోల్డ్‌ప్లే కచేరీలో కౌగిలింతపై మౌనం వీడిన క్రిస్టిన్ కాబోట్
ఇక సిల్వర్ ధర ఈరోజు ఉపశమనం కలిగించింది. ఈరోజు కిలో వెండిపై రూ.2,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,09, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లో రూ.2,21,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,09, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.