గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. శుక్రవారం బంగారం ధరలు పెరిగిపోయాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా మోత మోగించాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే.. మరుసటి రోజు మాత్రం జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,910 పెరగగా.. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో సిల్వర్ ధర సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది.
ఇది కూడా చదవండి: Australia: స్కైడైవర్‌లో అపశృతి.. విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్.. వీడియో వైరల్
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,910 పెరగగా.. రూ.1,32,660 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,750 పెరగగా రూ.1,21,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,430 పెరగగా రూ.99,490 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Zelenskiy: రష్యాతో శాంతి ఒప్పందానికి అమెరికా ఒత్తిడి.. జెలెన్‌స్కీ కొత్త ప్లాన్ ఇదే!
ఇక సిల్వర్ ధర మాత్రం బెంబేలెత్తిస్తోంది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.2,15,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,04, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.