మగువలకు శుభవార్త. బంగారం ధరలు గురువారం తగ్గాయి. రెండు రోజుల పాటు భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. బంగారం ధరలు రోజుకో మాదిరిగా ఉంటున్నాయి. ఒకరోజు భారీగా పెరిగిపోతుంటే… ఇంకోరోజు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఈరోజు మాత్రం తులం గోల్డ్‌పై రూ.160 తగ్గగా.. వెండి మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.4,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Indian Constitution: నైట్రోజన్ గ్యాస్ చాంబర్‌లో రాజ్యాంగం భద్రం! కారణమేంటో తెలుసా!
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.160 తగ్గి రూ.1,27,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 150 తగ్గి రూ.1,17,100 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.120 తగ్గి రూ.95,810 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన
ఇక వెండి ధర షాకిచ్చింది. కిలో వెండిపై రూ.4,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,73, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,80,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,73, 000 దగ్గర అమ్ముడవుతోంది.