పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇటీవల కాలంలో స్వల్పంగా తగ్గుతూ వస్తున్న ధరలు.. మంగళవారం మాత్రం భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ లవర్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. తులం గోల్డ్ ధరపై రూ.1,740 తగ్గగా.. కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Umar: ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,740 తగ్గి రూ.1,23,660 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,600 తగ్గి రూ.1,13,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,310 తగ్గి రూ.92,740 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Al-Falah University: అల్-ఫలాహ్ వర్సిటీలో ఈడీ దాడులు.. 25 చోట్ల ఏకకాలంలో సోదాలు
ఇక వెండి ధరలు కూడా భారీ ఊరటనిచ్చాయి. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,62, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 70,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,62, 000 దగ్గర అమ్ముడవుతోంది.