ఈరోజుల్లో మగవారి కంటే ఎక్కువగా ఆడవాళ్లు సొంతంగా వ్యాపారాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అంతేకాదు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మీరు కూడా వ్యాపారవేత్తలు అవ్వాలని అనుకుంటున్నారా.. అయితే మీకోసం చక్కటి బిజినెస్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు బాగా వంట చేస్తారా.. అయితే టమాటో కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించి మంచి లాభాలు అందుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టమోటా కెచప్, సాస్‌ను ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు, హోటళ్లు లేదా ఇళ్లలో కెచప్ లు మరియు సాస్‌లకు డిమాండ్ అధికంగా ఉంటుంది.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం.. వీటిని తయారు చెయ్యడానికి పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేదు.. యూ ట్యూబ్ లో టమాటో కెచప్/సాస్ తయారీకి సంబంధించిన అనేక వీడియోలు లభిస్తాయి. వాటిని చూసి పెద్దగా ఇబ్బంది లేకుండా ఇంట్లోనే సింపుల్ గా తయారు చేయొచ్చు..
ముందుగా బిజినెస్ ను స్టార్ట్ చెయ్యాలంటే మీరు తప్పనిసరిగా MSME పరిశ్రమ విభాగంలో వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి. మీరు ఆన్‌లైన్‌లో లైసెన్స్ పొందవచ్చు. ఇది మీరు నమోదు చేసిన 15 రోజులలోపు అందుకుంటారు.. ఇకపోతే మార్కెటింగ్ చాలా ముఖ్యం హోటళ్లు, కిరాణా దుకాణాలు, దాబాలు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో సాస్ మరియు కెచప్ చాలా అవసరం. మీరు అక్కడ సాస్‌ను కూడా అమ్మవచ్చు. లేదా హోల్ సేల్ వ్యాపారిని సంప్రదించి మీ ఉత్పత్తిని సేల్ చేసేందుకు సంప్రదించాలి..ఇది బిజినెస్ ను మొదలు పెట్టక ముందే సంప్రదించాలి..
మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద తక్కువ వడ్డీ రేటుతో రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణం కూడా ఇస్తుందని తెలుసుకోవాలి.. ఈ లోన్ ను మీరు 5 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. ఈ లోన్ కోసం మీరు మీ సమీపంలోని SBI లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులలో అప్లై చేసుకోవాలి..