Priyanka Jain Eliminated in Bigg Boss Telugu 7 Finale: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే దాదాపు ఈ షో చివరి అంకానికి చేరుకుంది. రేపు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ ఎవరు గెలిచారు? అనే విషయం రేపు రాత్రికి క్లారిటీ రానుంది. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి హౌస్ లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తారు నిర్వాహకులు. అందులో భాగంగా ప్రస్తుతానికి అమర్దీప్ చౌదరి, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, యావర్ హౌస్ లో ఉండగా వీరిలో ఇప్పటికే అర్జున్ అంబటి ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి.
Jabardasth Satya : పాత్ర నచ్చక పవన్ కల్యాణ్ గారి సినిమానే వదులుకున్నాను.
ఇక ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే విషయం మీద అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రమంలో సీరియల్ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ గా బయటకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫినాలే వేడుకకు పలువురు హీరోలు, ఇతర సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఈ ఎలిమినేషన్ విషయంలో కూడా ఒక స్టార్ హీరో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో రవితేజ పాల్గొన్నట్లు తెలుస్తోంది. హీరో రవితేజ, ప్రియాంక జైన్ ను స్టేజ్ మీదకి హౌస్ లోపల నుంచి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇవి లీక్స్ మాత్రమే కాగా నిజంగా ఈరోజు సాయంత్రం ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.