జబర్దస్త్’ కామెడీ షో తో ఎందరో కమెడియన్లు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం వారు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు. అలా రానిస్తున్న వారిలో సత్యశ్రీ కూడా ఒకరు . ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ కూడా ఈమె రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం వచ్చినా, చెప్పిన పాత్రకు చేసే సీన్ కు సంబంధం లేకపోవడంతో చేయనని బయటకు వచ్చేసినట్లు చెప్పింది సత్యశ్రీ.
“‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ లో నాకు అవకాశం వచ్చింది. షూటింగ్ దగ్గరికి వెళ్లాను. క్లబ్ లో ఓ డ్యాన్స్ సీన్ ను చేస్తున్నారు. నాకు చెప్పింది ఒకటి. అక్కడ చేస్తున్నది మరోకటి. నాకు నచ్చలేదు. వెంటనే చేయనని చెప్పి బయటకు వచ్చేశాను. పవన్ కల్యాణ్ గారి మూవీ అయినా కూడా అలాగే వచ్చేశాను. ఈ విషయాన్ని ఎవరో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ఆయన నన్ను పిలిపించారు. ఎందుకు నటించనని చెప్పారు..అని అడిగారు. నాకు భయం వేసింది సర్. అందుకే చేయనని చెప్పాను. మీది ఏ ఊరు అని నన్ను అడిగారు. తణుకు అని చెప్పాను. కాసేపు మాట్లాడి నాకు ధైర్యం చెప్పారు.అలాగే వెళ్లేటప్పుడు ఫోటో కావాలని అడిగితే కూడా ఇచ్చారు. నిజానికి నేను ఆయన అభిమానిని , నాతో మాట్లాడిన తర్వాత ఆయన మీద గౌరవం మరింత ఎక్కువ అయ్యింది” అని సత్యశ్రీ చెప్పుకొచ్చింది.అయితే తాను పలు సినిమాల్లో నటించినా కూడా కొన్ని సినిమాల్లో ఎడిటింగ్ లో తన సీన్లు పోయినట్లు సత్యశ్రీ తెలిపింది కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ వచ్చినా కూడా ఎడిటింగ్ లో పోయినట్లు ఆమె వివరించింది