‘బిగ్ బాస్ 5’ ఇప్పుడిప్పుడే మరింత ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం నామినేషన్స్ డే. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చెప్పుకునే రీజన్స్ కొన్ని సిల్లీగా ఉంటే, మరికొన్ని రిజనబుల్ గా ఉంటున్నారు. అయితే నిన్న కూడా నామినేషన్స్ వార్ గట్టిగానే జరిగింది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో కొంతమంది మొదటి వారం నుంచీ నామినేట్ అవుతుంటే, మరికొంత మంది అప్పుడప్పుడూ నామినేషన్లలోకి వచ్చి టెన్షన్ ను రుచి చూస్తున్నారు.
Read Also : బిగ్ షాక్… శ్రియకు పాప పుట్టిందా!?
అయితే ఈ వారం షణ్ముఖ్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేషన్లలోకి రాగా, కాజల్, యాని మాస్టర్ వంటి కంటెస్టెంట్లు తప్పించుకున్నారు. నిజానికి వీరిద్దరూ కాస్త వీక్ అనే చెప్పొచ్చు. ఫ్యాన్ బేస్ పరంగా చూసినా, లేదంటే టాస్కుల పరంగా చూసినా కూడా. గతసారి కాజల్, యాని నామినేట్ అయినప్పుడు వారు ఓట్లలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈసారి నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ వారానికైతే నామినేషన్ల నుండి తప్పించుకుంటున్నారు. ఇక వీరితో పాటు కెప్టెన్ గా ఉన్న ప్రియ కూడా ఈసారి నామినేషన్లలో లేదు.