బిగ్ షాక్… శ్రియకు పాప పుట్టిందా!?

శ్రియ శరన్ ఆమె అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన శ్రియ కొన్నాళ్లుగా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. 2018లో శ్రియ తన ప్రేమికుడు ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి విదేశాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో “ఆర్ఆర్ఆర్’తో ‘గమనం’ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సడన్ గా తనకు పాప పుట్టిందన్న విషయాన్నీ ప్రకటించి షాక్ ఇచ్చింది. గతంలోనూ ఇలాగె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Read Also : పుష్ప : ఆకట్టుకుంటున్న ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో

తాజా సమాచారం ప్రకారం శ్రియ శరన్, ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో తమ జీవితంలోకి ఒక ఆడ శిశువును స్వాగతించారు. శ్రియ స్వయంగా సోషల్ మీడియాలో పాపతో ఉన్న వీడియోను షేర్ చేసుకుంటూ ఈ విషయాన్నీ వెల్లడించింది. “హలో 2020 చాలా అందమైన క్వారంటైన్. ప్రపంచం మొత్తం గందరగోళాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మా ప్రపంచం మారిపోయింది. మా జీవితంలో ఒక ఏంజిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మేము దేవునికి కృతజ్ఞులం” అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. అయితే పాప ఫేస్ ను మాత్రం చూపించలేదు శ్రియ.

-Advertisement-బిగ్ షాక్… శ్రియకు పాప పుట్టిందా!?

Related Articles

Latest Articles