బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడం ఆషామాషీ విషయం కాదు. అందులో పాల్గొన్న వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయో ఒక్కోసారి ఊహించలేం కూడా! అదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ మొదలు కాగానే నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే నాటికి గంగవ్వకు సొంత ఇల్లు లేదు. ఓ చిన్న గదిలో ఆమె కాపురం ఉండేది. దానికి తాళం చెవి కూడా లేకపోవడంతో వైరు ముక్కతో తలుపు బంధించి, బయటకు వెళ్ళేది. అలాంటి గంగవ్వ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత సొంత ఇల్లు కట్టుకోగలిగిందని నాగార్జున తెలిపాడు. అంతేకాదు… ఆ ఇంటి గృహప్రవేశం వీడియోనూ బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ మేట్స్ కు చూపించాడు. సో… ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిన వారు తమ తమ రంగాలలో మరింత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ షో దోహదం చేస్తుందని నాగార్జున తెలిపాడు.
చిల్ర్డన్స్ డే స్పెషల్ గేమ్స్!
నవంబర్ 14 ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులతో పిల్లల ఆటలు ఆడించాడు. మెంబర్స్ ను రెండు గ్రూప్స్ చేసి మానస్ ను గేమ్ కు సంచాలకుడిగా నియమించాడు. టీమ్ ఎ లో షణ్ముఖ్, యానీ, ప్రియాంక, సన్నీ ఉండగా, టీమ్ బి లో శ్రీరామ్, సిరి, రవి, కాజల్ ఉన్నారు. వీరితో ఐస్, వాటర్ అండ్ ఫైర్ గేమ్ ఆడించాడు నాగార్జున. ఓ పాటకు తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉండే ఈ రెండు టీమ్స్ సభ్యులు, పాట ఆగిన తర్వాత నాగార్జున ఏ పదం చెబితే ఆ ప్రదేశం దగ్గరకు ముందుగా చేరాల్సి ఉంటుంది. ఇందులో చివరిగా సర్కిల్ లోకి వెళ్ళే వాళ్ళు ఓడిపోయినట్టు. అలా పలు రౌండ్స్ లో జరిగిన ఈ గేమ్ లో ఎ గ్రూప్ కు చెందిన సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలను చూపించి, గుర్తుపట్టమన్న ఆటలో టీమ్ ఎ విజేతగా నిలిచింది.
ఆదివారం చివరగా ‘మెడలో మెడల్’ అనే గేమ్ ను నాగార్జున ఇంటి సభ్యులతో ఆడించాడు. రకరకాల పదాలు ఉన్న మెడల్స్ ను సభ్యులకు ఇచ్చి, దానికి అర్హులైన వారి మెడలో వేయమని చెప్పాడు. అలానే అందుకు కారణాన్నీ వివరించమని కోరాడు. ఇందులో సన్నీ ఫేక్ అనే మెడల్ ను రవికి వేశాడు. మానస్ హెడేక్ అనే మెడల్ ను ప్రియాంక మెడలో వేశాడు. శ్రీరామ్ కాజల్ కు కన్నింగ్ అనే మెడల్ వేయగా, ప్రియాంక సన్నీకి సెల్ఫిష్ మెడల్ వేసింది. యానీ అదే మెడల్ ను షణ్ణు నుండి తీసుకుని సన్నీకి వేసింది. ఇక కాజల్ సిరికి డబుల్ ఫేస్డ్ అనే మెడల్ వేసింది. సిరి తన స్నేహితుడు షణ్ణుకు నెగెటివ్ అనే మెడల్ వేయడం విశేషం. నామినేషన్స్ మొదలయ్యే ముందు, బయటకు వెళ్ళిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి షణ్ణు తనకు చెబుతుంటాడని, దాంతో తనలో నెగెటివ్ థాట్స్ క్రియేట్ అయ్యి, ఎక్కడ నామినేట్ అయిపోతానో అనే భయం ఏర్పడుతుందని సిరి చెప్పింది. అదే విధంగా సిరికి షణ్ణు డబుల్ ఫేస్డ్ మెడల్ ను వేశాడు. కాజల్, షణ్ణు ఇద్దరూ వేర్వేరు కారణాలు చెప్పినా, వారిద్దరూ సిరినే టార్గెట్ చేయడం విశేషం.