టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఏటీఎం'. ఈ వెబ్ సీరిస్ ఇదే నెల 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు వస్తూ సందడి చేస్తున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అందించేందుకు బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ హౌస్‌లోకి వచ్చి సరదాగా కంటెస్టెంట్లతో ముచ్చట్లు చెప్పాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యుల మధ్య పోటీని నిర్వహించాడు. అఖిల్, బిందుమాధవి, అనిల్, బాబా భాస్కర్, అరియానా ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీలో బాబా భాస్కర్…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. బిగ్ బాస్ 5 ఫేమ్ సన్నీ, దివితో పాటు సుబ్బరాజు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 27 నుండి దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ‘దిల్’ రాజు ఫ్యామిలీ నెక్ట్స్ జనరేషన్ కు చెందిన హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్ సీరిస్ ను నిర్మిస్తున్నారు. సి.…
పాపులర్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్ తెలుగు 5” 100 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తర్వాత నిన్న గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర…
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా…
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని…
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని…
బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పుడు, ఎవరు, ఎవరితో మింగిల్ అవుతున్నారో తెలియకుండా ఉంది. కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో పోటీ కంటే కూడా చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. గార్డెన్ ఏరియాలోని గోల్డ్ మైన్ నుండి బంగారు ముత్యాలు ఏరుకోవడం, వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం రెండూ కూడా కొంత ఇబ్బందినే కలిగిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు అవకాశం చిక్కాలే కానీ దొంగలుగా మారిపోతున్నారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న…