Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని, శ్రీకృష్ణాష్టమి… జన్మాష్టమి, గోకులాష్టమి అంటారు. ఈ ఏడాది ఆగస్టు 16న గోకులాష్టమి జరుపుకోనున్నారు. ఈ రోజున విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. బృందావనంతో సహా అన్ని శ్రీకృష్ణుని ఆలయాలలో అలంకరణ మొదలైంది. శ్రీకృష్ణుడు యువరాజు వాసుదేవుడు, దేవకి దంపతుల ఎనిమిదవ కుమారుడు అని తెలిసే ఉంటుంది. శ్రీకృష్ణుని ఆరుగురు సోదరులను తన మామ కంసుడు పుట్టిన వెంటనే చంపాడు. ఈ రోజు ఆ సోదరుల గురించి తెలుసుకుందాం..
READ MORE: Saliya Saman: మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐసీసీ ఫైర్.. ఏకంగా ఐదేళ్లు!
కంసుడి చెల్లి పేరు దేవకి. కంసుడికి యువరాణి దేవకి అంటే ఎంతో ఇష్టం. దేవకిని యాదవ యువరాజు వాసుదేవుడి వైభవంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత.. తన సోదరిని ఆమె అత్తమామల ఇంటికి తీసుకెళ్లడానికి అతనే స్వయంగా రథం నడిపాడు. కానీ అతను రాజభవనం నుంచి బయటకు అడుగుపెట్టగానే.. ఆకాశవాణి (ఆకాశం నుంచి వచ్చే స్వరం) వినిపించింది. తాను ఎంతో ప్రేమతో పంపుతున్న సోదరి ఎనిమిదవ కుమారుడు తనను చంపుతాడని కంసుడికి చెప్పింది. ఆకాశవాణి విన్న తర్వాత కంసుడు చాలా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే వాసుదేవుడు, దేవకిని చెరసాలలో బంధించాడు. జైల్లో ఉన్న వాసుదేవుడు, దేవకి కుమారులందరినీ పుట్టిన వెంటనే చంపాలని నిర్ణయించుకున్నాడు.
READ MORE: Humayun’s Tomb collapse: సమాధి చూడటానికి వెళ్తే.. ఢిల్లీలో ఘోరం.. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారంటే..?
కంసుడి చెరలో ఉన్న దేవకి మొత్తం ఎనిమిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ఆగురు పిల్లలు జైలులోనే జన్మించారు. ఏడవ గర్భం విషయానికి వస్తే.. ఏడవ గర్భంలో ఆదిశేషువు ప్రవేశిస్తాడు. అయితే మహావిష్ణువు ఆ గర్భాన్ని వసుదేవుడి రెండో భార్య అయిన రోహిణి గర్భంలోకి మారుస్తాడు. ఆ బాలుడే బలరాముడు. కంసుని అకృత్యాలకు తన సంతానాన్ని పోగొట్టుకున్న దేవకి మళ్ళీ గర్భం ధరిస్తుంది. ఇది అష్టమ గర్భం అందుకే కంసుడు చెరసాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తాడు. నెలలు నిండిన దేవకి శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్ర శుభ లగ్నంలో, సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణునికి జన్మనిస్తుంది. ఈ బిడ్డను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు. ఆ సమయంలో అర్ధరాత్రి చెరసాలలో జన్మించిన బాలుడు సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే. ఆయనే తనను ఎలా కాపాడాలన్నది వసుదేవునికి వివరిస్తాడు. విష్ణు మాయతో వసుదేవుని సంకెళ్లు విడిపోతాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. సైనికులు స్పృహ తప్పి పడిపోతారు.
READ MORE: Krishna Janmashtami 2025: కంసుడు చంపిన శ్రీకృష్ణుడి ఆరుగురు సోదరుల పేర్లు తెలుసా..?
వసుదేవుడు బాల కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని రేపల్లెకు బయలుదేరుతాడు. ఆ అర్ధరాత్రి వేళ కుంభవృష్టి కురుస్తుండగా చిన్ని కృష్ణునికి ఆది శేషుడు పడగ విప్పి గొడుగు పడతాడు. అమిత వేగంతో ప్రవహిస్తున్న యమునా నది రెండుగా చీలి వసుదేవునికి మార్గం ఇవ్వగా వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. భటుల నుంచి సమాచారం అందుకున్న కంసుడు ‘ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ వల్లనే కదా నీకు ప్రాణాపాయం. కానీ పుట్టింది ఆడపిల్ల కదా విడిచి పెట్టమని’ దేవకి ఎంత ప్రార్ధించినా వినకుండా ఆ పసి బిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగ మాయగా మారి కంసుడికి దొరక్కుండా గాలిలోకి ఎగిరి ‘నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. కాగా.. పురాణాల ప్రకారం.. కంసుడు చంపిన ఆరుగురు పిల్లల పేర్లు కీర్తిమాన్, సుషేన్, భద్రసేన్, రిజు, సమ్మర్దనుడు, భద్రుడు వారు పుట్టిన వెంటనే కంసుడు వారిని చంపాడు.
నోట్: ఈ సమాచారం పలు పురాణాల నుంచి తీసుకున్నది. ntvtelugu.com క్లైమ్ చేయలేదు. నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది.