ఎలాన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశానికి రాలేదు. అయితే, నివేదికల ప్రకారం.. కంపెనీ ఏప్రిల్ నుంచి భారతదేశంలో కార్లను అమ్మడం ప్రారంభిస్తుంది. ఆ కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీని ధర దాదాపు రూ. 21 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇంతలో, ఎలక్ట్రిక్ ఫోర్- వీలర్ విభాగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.